పీఆర్సీపై ఇవాళ ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్ తో ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు.  ఉద్యోగ సంఘాల తరఫున వెంకట్రామిరెడ్డి, కేఆర్ సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, ఇతర నాయకులు హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ అంశంతో పాటుగా 71 డిమాండ్లపై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. 


Also Read: జనవరి చివరికి గరిష్టానికి కోవిడ్ కేసులు... వచ్చే నాలుగు వారాలు చాలా కీలకం... డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన


పీఆర్సీపై కీలక ప్రకటన వస్తుందా...!


పీఆర్సీపై గత కొద్ది కాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తుంది. సీఎంతో ఉద్యోగసంఘాలు భేటీ అవ్వడంతో ఓ క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికశాఖ పలుదఫాలు అధికారులు, మంత్రులతో చర్చలు జరిపింది. అయినా పీఆర్సీ నిర్ణయంపై ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగసంఘాల అసహనం వ్యక్తం చేశాయి. దీంతో సీఎం జగన్ భేటీలోనే స్పష్టత వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. సీఎంతో భేటీ తరువాత పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 


Also Read: నేడే ఏపీలో పీఆర్సీపై తుది నిర్ణయం? సీఎంతో భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు


సీఎం వద్దకు పీఆర్సీ వివరాలు


ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ అయితే ఏకంగా రెండుసార్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలతో మూడు సార్లు, ఆర్థిక మంత్రి బుగ్గనతో రెండుసార్లు, చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అంటూ అందరితోనూ అనేక మార్లు చర్చలు జరిపాయి ఉద్యోగ సంఘాలు. అయితే తాము డిమాండ్ చేసిన 48 శాతం పీఆర్సీపై ప్రభుత్వం నుంచి రెడ్ సిగ్నల్ రావడం, ఏకంగా 14.29 శాతం వద్దే ఫిక్స్ చేస్తామంటూ చెప్పడంతో ఉద్యోగ సంఘాలు షాక్ తిన్నాయి. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి పొందుతున్న తమకు పీఆర్సీ 14.29 శాతం అంటే ఇప్పుడువస్తున్న జీతంలో 13 శాతం వరకూ కోతపడుతుందనీ పీఆర్సీ వాళ్ల జీతం పెరగడం మాట అటుంచి తగ్గిపోతుందని అంటున్నారు. అయితే జీతాలు తగ్గకుండానే పీఆర్సీ అమలు చేస్తామంటూ సజ్జల హామీ ఇచ్చినా ఉద్యోగ సంఘాలు మాత్రం ఒకింత అసంతృప్తితోనే ఉన్నాయి. గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.


Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి