టిక్కెట్ రేట్ల తగ్గింపు అంశంలో ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అననట్లుగా మీడియా.. సోషల్ మీడియాలో వార్ ఆఫ్ వర్డ్స్‌కు దిగుతున్న రామ్‌గోపాల్ వర్మ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీలో తనకు నచ్చిన ఒకే ఒక్క వ్యక్తి సీఎం జగన్ అన్నారు. అయితే అతని చుట్టూ ఉన్న వ్యక్తులు అతన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని నమ్ముతున్నానంటున్నారు. ఆ వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారని అనుమానిస్తుననారు. అందకు వారికి వ్యక్తిగత ఎజెండాలు కూడా ఉండవచ్చంటున్నారు. అంతే కాదు.. సీఎం జనగ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని.. తన చుట్టూ ఉన్న ప్రమాదకర వ్యక్తుల గురించి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. 


 





Also Read: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు


వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఆర్జీవీ.. సినిమాటో గ్రఫీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న పేర్ని నానితోనే వాదనకు దిగారు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా ఇంకా ఆ పోరాటం కొనసాగిస్తున్నారు. టిక్కెట్ల రేట్ల అంశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కడిక్కకడ తప్పు పడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సీఎం జగన్‌ది తప్పు అని చెప్పడానికి మాత్రం ఆర్జీవీకి మనసు ఒప్పడం లేదు. పేదలకు వినోదాన్ని అందుబాటులోకి తెచ్చేందుకే టిక్కెట్ రేట్లు తగ్గించామని ... దాన్ని విమర్శిస్తున్న వారంతా పేదలకు శత్రువులే అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆర్జీవీ దృష్టికి వచ్చాయో లేదో స్పష్టత లేదు. 


Also Read: చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు, వదిలేస్తారు.. ఇప్పుడు పవన్ కోసం..: సోము వీర్రాజు


అయితే ఆర్జీవీ సీఎం జగన్‌కు ఏమీ తెలియదని.. ఆయన చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం అని నమ్ముతున్నారు. జగన్ ఒక్కరు తప్ప అందరూ అలాంటివారే అంటున్నారు. అంటే మంత్రులు, సలహాదారులు అందరూ ఈ పరిస్థితికి కారణం అని ఆయన నేరుగానే చెబుతున్నట్లయింది. అయితే సీఎం జగన్‌కు ఆ మాత్రం తెలియదా..? చుట్టుపక్కల వారు తమ వ్యక్తిగత స్వార్థం.. ఎజెండాల కోసం జగన్ ఇమేజ్‌ను వాడుకుంటున్నారని తెలుసుకోలేనంత స్థితిలో ఉంటారా? అన్న సందేహాలకు మాత్రం ఆర్జీవీ వద్ద కూడా ఆన్సర్ లేదు. బహుశా.. వచ్చే కొద్ది రోజుల్లో ఈ అంశంపై ట్వీట్లు చేస్తారేమో ? 


Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి