గూగుల్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘పిపిట్’ అనే కోడ్‌నేమ్‌తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌ను కంపెనీ అందించే అవకాశం ఉంది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 12 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ కొత్త పిపిట్ స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండనుంది. గూగుల్ ఇటీవలే టెన్సార్ ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో వీటినే అందించారు.
గూగుల్ పిపిట్ స్మార్ట్ ఫోన్‌లో 12 జీబీ వరకు ర్యామ్ ఉండనుందని గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం తెలుస్తోంది. ఈ ఫోన్ గీక్ బెంచ్ 4 సింగిల్ కోర్ టెస్టులో 4,811 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 11,349 పాయింట్లను సాధించింది. గూగుల్ పిక్సెల్ 6 సింగిల్ కోర్ టెస్టులో 4,758 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 11,038 పాయింట్లను సాధించింది.
2021లోనే గూగుల్ ఫోల్డబుల్ డివైస్‌ను 9టు5 గూగుల్ గుర్తించింది. ఈ పబ్లికేషన్ ప్రకారం ఇందులో గూగుల్ కెమెరా ఏపీకే యాప్‌ను అందించారు. ఈ పిపిట్ స్మార్ట్ ఫోన్‌లో 12.2 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్363 కెమెరా సెన్సార్‌ను అందించనున్నాయి.
కెమెరా యాప్‌లో ఫోల్డెడ్ అనే పదం కనిపించడం ద్వారా గూగుల్ పిపిట్ ఫోల్డబుల్ ఫోన్ అని కన్ఫర్మ్ అయింది. అయితే గూగుల్ మాత్రం ఇంతవరకు ఫోల్డబుల్ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: ఐఫోన్ 12 సిరీస్‌పై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ రాలేదు!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!