ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో భారీగా తగ్గించారు. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్లు రూ.10 వేల వరకు తగ్గాయి. రిటైల్ అవుట్ లెట్ల కంటే తక్కువ ధరకే ఈ ఫోన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌ను అందించారు. ఇవి 5జీ, 4జీ ఎల్టీఈ రెండిటినీ సపోర్ట్ చేయనున్నాయి.
ఐఫోన్ 12 ధర
ఐఫోన్ 12 ఇప్పుడు రూ.53,999కే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.63,900 ధరకు లిస్ట్ అయింది. ఈ ఫోన్ రిటైల్ ధర రూ.65,900గా ఉంది. ఐఫోన్ 13 సిరీస్ వచ్చాక.. వీటి ధరను యాపిల్ తగ్గించింది. ఇవి 64 జీబీ వేరియంట్ ధరలు. ఇక 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,999గా ఉంది. అమెజాన్, రిటైల్ అవుట్‌లెట్లలో రూ.70,900కు దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12 మినీ ధర
ఐఫోన్ 12 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.40,499కే అందుబాటులో ఉంది. ఇది 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఇక అమెజాన్‌లో దీని ధర రూ.53,900గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రిటైల్ ధర రూ.59,900గా ఉంది. అంటే రిటైల్ ధర కంటే దాదాపు రూ.20 వేల తగ్గింపు లభించిందన్న మాట. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 మినీ 128 జీబీ వేరియంట్ ధర రూ.54,999గా ఉండగా.. అమెజాన్, రిటైల్ అవుట్‌లెట్లలో రూ.64,900గా ఉంది.
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీల్లో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్ అందించారు. వీటిలో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను అందించారు. యాపిల్ సెరామిక్ షీల్డ్ గ్లాస్‌లను ఇందులో అందించారు. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల డిస్‌ప్లేను, ఐఫోన్ 12 మినీలో 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. వీటిలో చార్జర్ రాదు. మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ రెండిట్లోనూ వెనకవైపు రెండేసి కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉండనున్నాయి.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!