‘ఆ ఇద్దరి హీరోహీరోయిన్లు విడిపోతున్నారట?’ ‘ఆ నటి చాలా బోల్డ్,  ఆమె డ్రెస్సు చూశారా’... ఇలాంటి సెలెబ్రిటీ పుకారు వార్తలు ఇష్టపడే కేటగిరీ వారు తాము చాలా తెలివైన వాళ్లు అనుకుంటారట, నిజానికి వాళ్లు చాలా తెలివి తక్కువ వాళ్లని చెబుతోంది ఓ అధ్యయనం. ఈ పరిశోధనలో గాసిపింగ్‌కు సంబంధించి వివాదాస్పదమైన, కాస్త హాస్యాస్పదమైన ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే సెలెబ్రిటీ గాసిపింగ్ వార్తలు రాసే వారి సంగతి ఏంటి అంటూ కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది. వాటిని చదవడాన్ని ఇష్టపడే వాళ్లకు తెలివి తేటలు తక్కువుంటే, వాటిని రాసే వారు, టీవీల్లో ప్రసారం చేసి ప్రచారం కల్పించేవారి సంగతేంటని అడుగుతున్నారు కొంతమంది. 


ఈ అధ్యయనం 1763 మంది హంగేరీకి చెందిన పెద్దలపై నిర్వహించారు. వారిపై 30 పదాల వొకాబులరీ టెస్టు, డిజిట్ సింబల్ సబ్‌స్టిట్యూషన్ టెస్టు నిర్వహించారు. వాటిద్వారా ఒక అసెస్‌మెంట్ కు వచ్చారు. దాని ద్వారా ఫలితాలను వెల్లడించారు. ‘సెలెబ్రిటీలను ఆరాధించడం అనేది గత రెండు దశాబ్దాలుగా అధికమైంది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న అధ్యయనాలు, ఇప్పుడు ఈ కొత్త అధ్యయనం ప్రకారం ఎవరైతే తమకిష్టమైన సెలెబ్రిటీ పట్ల చాలా అభిమానాన్ని చూపిస్తారో, వారి గురించిన వార్తలు, పుకార్లు ఎక్కువగా చదవడం, ఆలోచించడం, మాట్లాడడం చేస్తారో వారి కాగ్నిటివ్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి. అంటే తెలివి తేటలు తక్కువగా ఉంటాయని అర్థం’ అని చెప్పుకొచ్చారు పరిశోధకులు. 


సెలెబ్రిటీల పట్ల అభిమానం మితిమీరితే ఆ అభిమానుల కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గుతాయి. కాబట్టి ఏదైనా హద్దుమీరకుండా చూసుకోవాలి. ఇష్టం ఉండొచ్చు కానీ వారే ధ్యాసగా నిత్యం ఆలోచించేంత స్థాయిలో ఉండకూడదు. సెలెబ్రిటీ ఆరాధకులే వేరే సెలెబ్రిటీలను ట్రోల్ చేస్తుంటారు. తమ ఇష్టమైన నటుడు, లేదా నటి సమస్యను తమదిగా భావించి ఇతరులతో కొట్లాడుతుంటారు. అందుకే అతి అనర్ధానికే దారితీస్తుందని అంటారు పెద్దలు. సెలెబ్రిటీలపై అభిమానాన్ని కూడా హద్దుల్లోనే ఉంచుకోవడం ఉత్తమం. 


Also read:  పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్


Also read: ‘స్క్రూ డ్రైవర్’ కాక్‌టెయిల్... ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు


Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు


Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు


Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.