రెండు మూడు పానీయాలు కలిపి చేసే కాక్ టెయిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పుడవి ట్రెండింగ్ కూడా. అతిథులను ఆహ్లాదపరిచేందుకు మిక్సాలజిస్టులు ఎన్నో జ్యూసులను కలుపుతూ కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి కొత్త కాక్‌టెయిల్ ‘స్క్రూ డ్రైవర్’. ఆరెంజ్ జ్యూస్, వోడ్కా కలిపి తయారుచేసే కాక్ టెయిల్ ఇది. కాక్‌టెయిల్ లవర్స్‌కు తెగ నచ్చేసిందట ఈ మిక్స్‌డ్ జ్యూస్. 


ఆ పేరెలా...?
రచయిత విక్టోరినో మాటస్ ‘వోడ్కా: హౌ ఎ కలర్‌లెస్, డోర్‌లెస్, ఫ్లేవర్‌లెస్ స్పిరిట్ కాంక్వెర్డ్ అమెరికా’ అనే పుస్తకం రాసింది. అందులో 1950లలో ఈ కాక్ టెయిల్‌ను తయారుచేసినట్టు చెప్పారు రచయిత. పెర్షియన్ గల్ఫ్‌లోని అమెరికాకు చెందిన చమురు కార్మికులు నారింజ రసంలో వోడ్కాను కలిపి తాగేవారు. అది కూడా రహస్యంగా. అయితే ఆ రెండింటి జ్యూసులను కలిపేందుకు చెంచా లేకపోవడంతో స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించేవారు. దీంతో ఆ కాక్‌టెయిల్ పేరు ‘స్క్రూ డ్రెవర్ కాక్‌టెయిల్’గా స్థిరపడింది.


వోడ్కాతో తయారుచేసిన మొదటి కాక్ టెయిల్స్‌లో స్క్రూడ్రైవర్ కూడా ఒకటని చెబుతారు.   అయితే మరొక కథనం ప్రకారం 1949లో రెండో ప్రపంచయుద్ధ సమయంలో టర్కిష్ ఇంటెలిజెన్స్, బాల్కన్ శరణార్ధులు, అమెరికన్ ఇంజినీర్లు కలిపి ఈ కాక్‌టెయిల్‌ను మొదటి సారి కనిపెట్టినట్టు చెబుతారు. ఏది ఏమైనా ఈ పానీయం కాక్ టెయిల్ ప్రియులకు ఆనందాన్ని పంచుతోంది.


ఎలా చేయాలి?
ఐస్ క్యూబ్స్‌తో నిండిన ఒక గ్లాస్ తీసుకోవాలి. అందులో ఒక భాగం వోడ్కా, రెండు భాగాలు ఆరెంజ్ జ్యూస్ వేయాలి. ఆ రెండింటినీ బాగా కలపాలి. తాగుతుంటే కిక్కు మామూలుగా ఉండదు. 


Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు


Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు


Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి


Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు


Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం





 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.