కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామం వద్ద మున్నేరులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు పిల్లలు సోమవారం మధ్యాహ్నం మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కూడా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 


Also Read: ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి.. నినాదంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు


ఈతకు వెళ్లి గల్లంతు..!


చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు . ఏటూరు గ్రామానికి చెందిన చరణ్, బాల యేసు, అజయ్, రాజేష్, సన్నీలు సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా ఈత కొట్టేందుకు కృష్ణానదిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కృష్ణా నది వైపు వెళ్లారని తల్లిదండ్రులకు స్థానికులు తెలపడంతో... విద్యార్థులు కృష్ణా నదిలో దిగినట్లు గుర్తించి పోలీస్ రెవెన్యూ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థులు ఎక్కడ ఉన్నారనే దానిపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. గల్లంతైన వారు చరణ్ , బాల యేసు(13), అజయ్, రాకేష్ , సన్నీగా గుర్తించారు. 


Also Read: Nellore Police: ఈ ఘటన.. దిశ యాప్ ద్వారా ఎలా సాయం అందుతుందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. మీరూ చదవండి


Also Read: Perni Nani: ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా ఉంటే సినిమాలు వాయిదా వేసుకోవచ్చు... ఆర్జీవీలా ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వొచ్చు... మంత్రి పేర్ని నాని


Also Read: Payyavula Kesav: రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా?... మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారు... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి