రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు సినిమా టిక్కెట్ల ధరల గురించే మంత్రులు చర్చిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతు సమస్యలు, తగ్గిన ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల కోసం మంత్రులు ఎప్పుడైనా చర్చించారా అని పయ్యావుల విమర్శించారు.


Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?


మంత్రులు మాట్లాడడం మర్చిపోయారు 


ఏపీ స‌చివాల‌యంలో సోమవారం పీఎసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి అధికారులు హాజ‌రు కాక‌పోవ‌టంపై పీఏసీ ఛైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ అభ్యంత‌రం తెలిపారు. సంబంధిత అధికారుల‌కు కోవిడ్ సోకితే మిగిలిన అధికారులు కూడా స‌మావేశానికి గైర్హాజరు అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో సినిమాలకు మించిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగిందని, కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారన్నారు. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని పీఏసీ కమిటీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. 


Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ


ఓటీఎస్ పేరుతో అక్రమంగా డబ్బు వసూలు


ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయబోతున్నారని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రాజకీయాల్లో సామాజిక విప్లవం తీసుకొచ్చిన మహానీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో అన్ని వర్గాలకూ అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. 


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


Also Read: కేజీహెచ్ పేరు మార్చడం కాదు చేతనైతే విశాఖ రైల్వే జోన్ సాధించండి.... బీజేపీ నేతలకు మంత్రి అవంతి స్ట్రాంగ్ కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి