ఉత్పత్తిదారునకు, వినియోగదారునికి మధ్య ప్రభుత్వం ఉండకూడదని చెప్పానని రామ్‌గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ తర్వాత మీడియాకు చెప్పారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని తాము చట్ట విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఆర్జీవీకి చట్టం గురించి చెప్పానని వివరించారు. అంటే ఇద్దరూ ఎవరి వాదన వారు వినిపించారు.. కానీ ఒకరి వాదనను ఒకరు అంగీకరించలేదన్నమాట. అయితే చర్చలు మాత్రం సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. వంద శాతం సంతృప్తినిచ్చిందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. నాలుగు గంట చర్చలో లంచ్ బ్రేక్ కూడా ఉంది. ఆ బ్రేక్‌లో మంత్రి పేర్ని నాని ఆర్జీవీకి పసందైన విందు ఇచ్చారు. రొయ్యల కూర, మటన్, చికెన్ ప్లెయిన్‌ బిర్యానీతో భోజన ఏర్పాట్లు చేశారు. భోజనం ముందు కాసేపు.. భోజనం తర్వాత కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. 


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
 
భేటీ పూర్తయిన తర్వాత వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడిన ఆర్జీవీ సినిమా టిక్కెట్ల వివాదం త్వరలోనే పరిష్కార అవుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.  మంత్రి పేర్ని నానితో మొత్తం ఐదు అంశాలపై మాట్లాడానన్నారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు వల్ల మూవీ మేకింగ్‌లో నాణ్యత తగ్గిపోతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు నిర్ణంయ తీసుకున్నారని అనుకోవట్లేదని స్పష్టం చేసారు. ఇదే పరిస్థితి ఉంటే సినిమా రంగం దెబ్బతింటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. 


Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల


సినిమా ధియేటర్ల మూసివేత అంశంలో తాను ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. తాను ఓ ఫిల్మ్‌మేకర్‌గా మాత్రమే వచ్చి తన అభిప్రాయాలు చెప్పానని..  ఇండస్ట్రీ తరపున కానీ.. ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల తరపున రాలేదని ఆయన స్పష్టం చేశారు. పేర్ని నానితో జరిపిన చర్చలపై తాను వంద శాతం సంతృప్తిగా ఉన్నానని ఆర్జీవీ ప్రకటించారు.  సినిమా తీసిన వాళ్ళే రేటు నిర్ణయించుకోవాలని.. ,ప్రభుత్వానికి టికెట్ రేట్లు తగ్గించే అవకాశం లేదని తాను చెప్పానన్నారు.. స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌న్నది త‌న ఉద్దేశ‌మ‌ని కానీ.. ఇది ఫైనల్ చేసేది తాను కాద‌న్నారు. తన పాయింట్ ఆఫ్ వ్యూ విపులంగా చెప్పడానికి వ‌చ్చానని.. .వినియోగదారుడికి, తయారీదారుడికి మధ్య ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 


Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు


ఆ తర్వాత ఆర్జీవీలో చర్చల అంశంపై పేర్ని నాని ఏదో ఫార్మల్ మీటింగ్ అన్నట్లుగా చెప్పారు. టిక్కెట్ ధరల అంశంపై ఇప్పటికే కోర్టు సూచనలతో కమిటీ ఏర్పాటైందని ... ఆ కమిటీతో తనకు సంబంధం లేదన్నారు. అంటే టిక్కెట్ ధరలతో తనకు సంబంధం లేదని చెప్పేసినట్లయింది. అదే సమయంలో  తాము చట్ట ప్రకారమే చేశామని.. చట్ట విరుద్ధంగా ఏణీ చేయలేదని ఆ విషయాన్ని వర్మకు చెప్పానన్నారు.


 


 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి