ABP  WhatsApp

PM Modi Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీం కీలక నిర్ణయం.. స్వతంత్య్ర కమిటీ ఏర్పాటు

ABP Desam Updated at: 10 Jan 2022 02:17 PM (IST)
Edited By: Murali Krishna

పంజాబ్ పర్యటనలో ప్రధానికి ఎందురైన భద్రతా లోపంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్య్ర కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీం కీలక నిర్ణయం

NEXT PREV

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ స్వతంత్య్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని తెలిపింది.







చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఐజీ, పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్టర్ జనరల్, పంజాబ్ ఏడీజీపీ (భద్రత)లను కూడా ఈ కమిటీలో సభ్యులుగా తీసుకువోలాని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.


ఈ వ్యవహారంపై ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలను దర్యాప్తు నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. 


పంజాబ్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది.. కేంద్రం నియమించిన కమిటీపై విశ్వాసం లేదన్నారు. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర అధికారులను దోషులుగా కమిటీ చిత్రీకరిస్తుందన్నారు. తప్పని కమిటీ తేల్చిందన్నారు.


కేంద్రం వాదన..


కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కేంద్ర ప్రభుత్వ కమిటీ దర్యాప్తును నిలుపుదల చేయకముందే పంజాబ్​ డీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు ఇచ్చినట్లు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటి వరకు కమిటీ ఎలాంటి విచారణలు చేపట్టలేదన్నారు. నిబంధనల ప్రకారం డీజీ, నిఘావిభాగం అధికారులదే బాధ్యత అన్నారు.


ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.


సుప్రీం వ్యాఖ్యలు..


ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.



ప్రధాని పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందని పంజాబ్​ ప్రభుత్వం కూడా అంగీకరించింది. విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. కానీ కేంద్రం ముందుగానే పలానా అధికారులు బాధ్యులు అంటూ.. చర్యలకు ఉపక్రమిస్తే మా విచారణ ఎందుకు. ఇరు వర్గాలు నియమించిన కమిటీ దర్యాప్తును నిలిపివేస్తున్నాం. స్వతంత్య్ర కమిటీ దర్యాప్తు చేస్తుంది.                             - సుప్రీం ధర్మాసనం


Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 10 Jan 2022 02:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.