ఘాట్ రోడ్డులోనే కాదు.. పర్వతాల మధ్య బోటింగ్ కూడా ప్రమాదకరమే. ఇందుకు బ్రెజిల్(Brazil)లో చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదమే నిదర్శనం. ఫుర్నాస్ లేక్ (Furnas Lake)లోని ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న జలపాతం నిత్యం.. పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కొండల మధ్యలో ఉండే జలపాతాన్ని చూసేందుకు బోటులో ప్రయాణించాలి. అయితే, శనివారం అక్కడ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. నిట్టనిలువగా ఉండే పర్వతానికి పగుళ్లు ఏర్పడి.. కొండచరియలు విరిగి సమీపంలో ఉన్న రెండు పర్యాటక బోట్లపై పడ్డాయి. ఈ ఘటనలో 32 మంది గాయపడ్డారు. ఆరుగురు చనిపోయారు.
వేరే బోట్లలోని ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని తమ కెమేరాల్లో రికార్డు చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాద స్థలం.. సావో జోసే ద బర్రా(Sao Jose da Barra), క్యాపిటోలియో(Capitolio) మధ్యలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా బోట్లు మునిగిపోయాయి. పర్యాటకులు నీటిలోకి దూకి ప్రాణాలు రక్షించుకోడానికి ప్రయత్నించారు. వారిని రక్షించడం కోసం అధికారులు డైవర్స్, హెలికాపర్లతో గాలింపులు జరిపారు. గాయపడినవారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రాంతం సావో పౌలో(Sao Paulo)కు 420 కిమీల దూరంలో ఉంది. 1958లో హైడోఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటు నుంచి ఫర్నాస్ లేక్ పర్యాటకుల కేంద్రంగా మారింది. ఇక్కడికి నిత్యం 5 వేలమంది పర్యాటకులు వస్తుంటారని, హాలీడేస్‌లో సుమారు 30 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పర్వతం బలహీనంగా మారిందని, అందుకే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటన తర్వాత అక్కడికి పర్యాటకుల రాకపోకలను నిలిపేశారు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి