మెున్నటి వరకు వరకు ఏపీ మంత్రి పేర్ని నాని.. దర్శకుడు ఆర్జీవీ మధ్య సినిమా టికెట్ల రేట్లపై వార్ నడిచింది. ఇందులో భాగంగానే మంత్రికి పలు ప్రశ్నలు వేశారు ఆర్జీవీ. మరోవైపు మంత్రులు సైతం.. టికెట్ల రేట్లపై కామెంట్స్ చేస్తూ.. వచ్చారు. వాటికి ఆర్జీవీ కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ కాదని.. కలిసే మాట్లాడుకుంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ సోమవారం భేటీ కానున్నారు. ఈ సమావేశంతోనైనా.. సినిమా టికెట్ల వ్యవహరానికి బ్రేక్ పడుతుందో లేదా అనేది అందరూ వేచి చూస్తున్నారు.
మంత్రి పేర్ని నానికి తొమ్మిది ప్రశ్నలను వేసి సవాల్ విసిరారు ఆర్జీవీ. అయితే వాటికి కౌంటర్ సమాధానాలిచ్చారు మంత్రి పేర్ని నాని. ఇలా మళ్లీ వర్మ కొన్ని కౌంటర్స్ ఇచ్చారు. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టి.. నేరుగా కలిసి మాట్లాడుకుందామనే ప్రతిపాదనను పెట్టారు వర్మ. దీనికి సరే అని చెప్పారు.. మంత్రి. ఇన్నీ రోజులు ట్విట్టర్ లో జరిగిన వార్.. ఇప్పుడు ఫేస్ టూ ఫేస్ భేటీ వరకు వచ్చింది. కలిసి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రిని.. వర్మ అడిగిన వెంటనే పేర్ని నాని తప్పకుండా త్వరలో నే కలుద్దామని చెప్పారు.
సోమవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ జరగనుంది. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు ఆర్జీవీ ట్విట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం బేటీ అవ్వనున్నారు.
ఇప్పుడు ఈ భేటీపై అందరికీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలపై చర్చ జరగనుంది. భేటీలో భాగంగా.. వర్మ ఎలాంటి అంశాలను మంత్రి ముందుంచుతారు? వర్మ ప్రభుత్వం ముందు ఉంచే అంశాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరం. సినిమా టికెట్ల ధరలపై దర్శకుడుగా తన బాధను మంత్రి ముందు చెబుతారా? లేక ఇండస్ట్రీ తరఫున సమస్యలన్నీ చెబుతారా? చూడాలి.
Also Read: RGV Perni Nani : ఎప్పుడు : పదో తేదీ , ఎక్కడ : అమరావతి, ఏం జరగనుంది : ఆర్జీవీ - పేర్ని నాని భేటీ !