టాలీవుడ్ సమస్యలపై చర్చించేందుకు రామ్‌గోపాల్ వర్మకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ ఇచ్చారు. పదో తేదీన మద్యాహ్నం అమరావతిలోని సెక్రటేరియట్‌కు రావాలని పేర్ని నాని పేషీ నుంచి రామ్‌గోపాల్ వర్మకు సమాచారం అందింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించిన రామ్‌గోపాల్ వర్మ .. పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు. టిక్కెట్ల అంశం వివాదాన్ని తార్కిక ముగింపు ఇవ్వడానికి తన ఆలోచనలు పంచుకుంటానని ఆర్జీవీ తన ట్విట్టర్ పోస్టులో తెలిపారు. 


Also Read: ఏపీలో సినిమా వ్యాపారానికి మరో దెబ్బ... కొత్త సినిమాలకు కలెక్షన్లు రావడం కష్టమే!


ఇటీవల ఆర్జీవీ- పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్ నడిచింది ., టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆర్జీవీ తప్పు పడుతూ వరుసగా భారీ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో పేర్ని నాని కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సమయం ఇస్తే వచ్చి కలిసి టిక్కెట్ల అంశంపై వివరాలు ఇస్తామని ఆర్జీవీ పేర్ని నాని కోరారు. దానికి అంగీకరించిన పేర్ని నాని.. తప్పకుండా కలుద్దామని మాటిచ్చారు. అన్న ప్రకారం ఆయనకు పదో తేదీన అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


పేర్ని నాని గతంలో టాలీవుడ్ సమస్యలపై చర్చలు జరిపినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా లేరు. కానీ ఇటీవలఆయనకు సీఎం జగన్ ఆ శాఖ కేటాయించారు. దీంతో  పేర్ని నాని జరిపే చర్చలు అధికారికం అవుతాయి. ఇప్పుడు టిక్కెట్ రేట్ల అంశంపై ఇండస్ట్రీ ఆలోచనలు ఉన్నీ చెప్పే అవకాశం ఆర్జీవీకి లభించినట్లయింది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌ నుంచి నిర్మాతలు .. ఇతర హీరోలు కలుస్తామన్నా.. ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎవరూ పెద్దగా అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదు. అయితే ఆర్జీవీకి మాత్రం వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


ఆర్జీవీతో వాదన అంత తేలిక కాదు. ఈ విషయంలో పేర్ని నానికి ట్వీట్ల సమయంలోనే తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికే  ఆర్జీవీ జగన్ విషయంలో చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆయనకేమీ తెలియదని ఆయన చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ఉన్నారని.. వారే తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాల కారణంగా ఆర్జీవీ - పేర్ని నాని భేటీ హైలెట్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి