తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 48,583 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1673 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,042కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1165 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి శనివారం 330 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,76,466కి చేరింది.
Also Read: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
రేపటి నుంచి బూస్టర్ డోస్
తెలంగాణలో రేపటి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుంది. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇస్తారు. బూస్టర్ డోస్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్‌తోనే బూస్టర్ డోసు తీసుకోవచ్చు. దీనికోసం కొవిన్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా, లేదంటే నేరుగా.. టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారికి, 60 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8.3 లక్షల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది.
Also Read: PM Modi Chairs Covid Meeting: కొవిడ్ ఉద్ధృతిపై ప్రధాని మోదీ సమీక్ష.. వారికి ఇక వర్క్ ఫ్రం హోం
కొవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మూడో డోస్‌ను తీసుకునేవారు.. నేరుగా ఏదైనా కొవిడ్-19 టీకా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్‌తో టీకాలు వేయడం జనవరి 10 నుంచి.. ప్రారంభమవుతుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రికాషన్ కొవిడ్ వ్యాక్సిన్.. గతంలో ఇచ్చిన వ్యాక్సిన్‌గానే ఉంటుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read: ఏపీలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 1257 కోవిడ్ కేసులు, ఇద్దరు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి