ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,479 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1257 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 140 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,580 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 4774 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






Also Read:  భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,81,859కి చేరింది. గడిచిన 24 గంటల్లో 140 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4774 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,16,05,951 శాంపిల్స్ పరీక్షించారు.  


Also Read: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!


దేశంలో కేసులు


దేశంలో కొత్తగా 552 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మొత్తం కేసుల్లో 1,409 మంది ఒమిక్రాన్ బాధితులు రికవరయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, దిల్లీ (513), కర్ణాటక (441), రాజస్థాన్ (373), కేరళ (333), గుజరాత్ (204) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 224 రోజుల్లో ఇదే అత్యధికంగా. యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,611కు చేరింది.  గత 197 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది మే 29న దేశంలో 1,65,553 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read: లీవ్‌ల కోసం కరోనా నకిలీ సర్టిఫికెట్, అడ్డంగా బుక్కైన మహిళ.. ఎలా దొరికిపోయిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి