భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృభిస్తోంది. ఐటీ కంపెనీలు సహా ఇంటి నుంచి పని చేసుకొనే వీలున్న అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి. ఒక వేళ ఎవరైనా ఉద్యోగి కరోనా బారిన పడితే వారికి వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాయి. ఇలా కంపెనీలు కల్పించే సౌకర్యాలను అలుసుగా తీసుకొని కొందరు అక్రమంగా వాడుకొనే వారూ ఉన్నారు. దీన్ని దుర్వినియోగం చేస్తూ ఓ మహిళ అడ్డంగా బుక్కయింది. 


కొంత మంది ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తుండటం పట్ల కంపెనీలు కూడా సీరియస్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ కోవలోనే ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి అడ్డంగా బుక్కైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పేరున్న ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న ఓ మహిళ ఊరికే సెలవులు తీసుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్లాన్ వేసింది. కొవిడ్ సోకిన వారికి ఎలాంటి వేతనంలో కోత లేకుండా కంపెనీలు ఇస్తున్న సదుపాయాన్ని వాడుకోవాలని భావించింది. ఇందుకోసం తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ నుంచి నకిలీ సర్టిఫికెట్‌ను పొందింది. దాన్ని వాళ్ల సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్ఆర్ విభాగానికి ఇచ్చి సెలవులు తీసుకుంది.


అయితే, హెచ్ఆర్‌లు ఆ సర్టిఫికెట్‌పై విచారణ చేపట్టారు. దీంతో అది నకిలీ సర్టిఫికేట్ అని తేలింది. ఈ విషయం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి చేరవేయడంతో ఆ ఉద్యోగిపై చర్యలు తీసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సాఫ్ట్‌వేర్ సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఇప్పటికే చాలా మంది ఐటీ ఉద్యోగులు తమకు కోవిడ్ సోకినట్లు సర్టిఫికెట్లు సమర్పించి సెలవులు తీసుకోవడంతో అందులో ఎన్ని నిజమైనవి? ఎన్ని నకిలీవో తెలియక యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగులే కాకుండా ఇతర రంగాల్లోని ఉద్యోగులు చాలా మంది డయాగ్నోస్టిక్ సెంటర్లకు డబ్బులిచ్చి ఫేక్ కరోనా సర్టిఫికేట్లు పొందినట్లుగా తెలుస్తోంది.


Also Read: Court Summons To God : నువ్వేనా ? కాదా ? కోర్టుకు వచ్చి నిరూపించుకోవాలని దేవుడికి కోర్టు సమన్లు ! మరి దేవుడు వచ్చాడా ?


Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి