ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక (ఐసీజీఎస్) అంకిత్.. పాకిస్థాన్‌కు చెందిన యాసీన్ అనే బోటును పట్టుకుంది. అరేబియా సముద్రంలోని మన ప్రాంతంలో పట్టుకున్న ఈ పడవలో 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి గస్తీ కాసే సమయంలో ఈ పడవను అధికారులు గుర్తించారు.
వీరందరినీ తదుపరి విచారణ కోసం పోర్‌బందర్ తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రాదేశిక జలాల్లో 6-7 మైళ్లు లోపలికి ఈ పడవ వచ్చిందని.. మన గస్తీ నౌకను చూసిన వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫిరోజ్‌పుర్‌లో..
ఫిరోజ్‌పుర్ సమీపంలో పాక్‌కు చెందిన ఓ పడవను బీఎస్‌ఎఫ్ సిబ్బంది శనివారం కనుగొన్నారు. 136 బెటాలియన్‌కు చెందిన సిబ్బంది డీటీ మాల్ సరిహద్దు ఔట్‌పోస్ట్ సమీపంలో గస్తీ నిర్వహింస్తుడగా ఈ పడవను గుర్తించారు.
ప్రధాని మోదీ ఇటీవల ఫిరోజ్‌పుర్ సభకు వెళ్తూ భద్రతా లోపం కారణంగా ఆకస్మికంగా పర్యటనను ముగించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ బోటు చిక్కడం ఆందోళన కలిగిస్తోంది.
ఫిరోజ్‌పుర్.. పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండే ప్రాంతం. భద్రతపరంగా అత్యంత సున్నితమై ప్రాంతం.
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి