Will Young Seven runs: అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్ చాలా ఎదిగింది. ఒకప్పుడు పసికూనగా ఉన్న బంగ్లా పులులు ఇప్పుడు పెద్ద జట్లతో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. విజయం కోసం పోరాడుతున్నారు. కానీ ఆ జట్టులో కొన్నిసార్లు అత్యుత్సాహం కనిపిస్తుంది. సులభంగా పని జరగాల్సిన చోట ఆత్రంతో చెడగొట్టుకుంటుంటారు! న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇలాంటి కామెడీ సీన్లు కనిపించాయి!
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్‌ను ఇబాదత్ హుస్సేన్ వేశాడు. ఆఖరి బంతిని విల్‌యంగ్ ఆడాడు. ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతి విల్ యంగ్ బ్యాటు అంచుకు తగిలి ఫస్ట్‌స్లిప్ వైపు వెళ్లింది. అక్కడి ఫీల్డర్ పట్టేసుకుంటే ఔటయ్యేవాడే. కానీ అతడు అందుకొనేలోపే రెండో స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ ఎడమవైపు డైవ్ చేసి బంతి అందుకొనేందుకు ప్రయత్నించాడు. అది అతడి చేతుల్లోంచి జారిపోయి బౌండరీ వైపు సాగింది.
బౌండరీ సరిహద్దు వద్ద ఓ ఫీల్డర్ డైవ్ చేసి ఆ బంతిని ఆపేశాడు. అప్పటికి విల్‌యంగ్ మూడో పరుగు తీస్తున్నాడు. కీపర్‌కు వైపు వచ్చిన ఆ బంతిని ఆవేశంతో మరో ఫీల్డర్ బౌలర్‌వైపు విసిరాడు. అది అతడి నుంచి తప్పించుకొని బౌండరీకి చేరుకుంది. అంటే బ్యాటర్ ఔటవ్వాల్సిన చోట మొదట మూడు పరుగులు వచ్చాయి. అక్కడితో ఆగిపోకుండా ఓవర్ త్రో రూపంలో మరో నాలుగు పరుగులు.. మొత్తంగా ఏడు పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచులో ఆతిథ్య న్యూజిలాండ్ భారీ స్కోరువైపు సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లేథమ్ (186 బ్యాటింగ్) డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. వన్‌డౌన్ ఆటగాడు డేవాన్ కాన్వే (99 బ్యాటింగ్) సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు. విల్ యంగ్ (54) అర్ధశతకం తర్వాత ఔటయ్యాడు. షోరిఫుల్ ఇస్లామ్‌కు ఈ వికెట్ దక్కింది.
Also Read: IND vs SA, 2nd Test: టీమ్‌ఇండియా బౌలర్లు నా ఒంట్లో ఎముకలైనా విరగొట్టాలి! కానీ నేను ఔటవ్వను డాడీ!!
Also Read: Sachin Tendulkar: అభిమానులకు షాకిచ్చిన సచిన్..! కఠిన నిర్ణయం తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్
Also Read: IND vs SA: మరే భారత ఆటగాడు బద్దలు చేయని సచిన్ 2 రికార్డులివి!