మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ఇంతలోనే తీవ్రనిర్ణయం తీసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో సూసైడ్ చేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ చనిపోయారు. 2020లో భద్రాద్రి కొత్తగూడెంలో అశోక్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ విధుల్లో చేరారు. ఇటీవల పోలీస్ శాఖలో జరిగిన బదిలీల్లో ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు. 


Also Read: మా చావుకు కారణం ఆ నలుగురే.. అస్సలు వదలొద్దు.. నిజామాబాద్ ఫ్యామిలీ సెల్ఫీ వీడియో వెలుగులోకి..


ఖమ్మం లాడ్జ్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య


ఈ నెల 8వ తారీఖున అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో అశోక్ రూమ్ తీసుకున్నారు. ఇవాళ ఉదయం రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డోర్ తెరిచి చేసి చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఉరి వేసుకుని చనిపోయారని గుర్తించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం. ఇవాళ సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Also Read:  కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..


ఇవాళే నిశ్చితార్థం ఇంతలో.. 


ఇవాళ అశోక్ నిశ్చితార్థం ఉండగా ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఏమైందో తెలుసుకుందామని అశోక్ తల్లిదండ్రులు ఫోన్ చేశారు. వారు ఎంత ప్రయత్నించినా ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇంతలో కుమారుడు చనిపోయాడని పోలీసులు వారికి సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ములుగు జిల్లాకు బదిలీ విషయంలో కొంత అసహనంతో పాటు నిశ్చితార్థం ఇష్టం లేకే అశోక్‌ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి