హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం రవాణా కొనసాగుతూనే ఉంది. దుబాయ్ నుంచి విమానం వచ్చిందంటే చాలు.. ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారులు క్షుణ్నంగా ప్రయాణికులను పరిశీలించాల్సి వస్తోంది. తాజాగా ఆదివారం రాత్రి షార్జా నుంచి వచ్చిన జీ9-450 విమానంలో ప్రయాణికుడి నుంచి రూ.47.55 లక్షలు విలువ చేసే 970 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే, ఇక్కడ బంగారం స్మగ్లింగ్ చేసిన వ్యక్తి అమాయకుడిలా నటించడం విశేషం. కాలు విరిగి దెబ్బతగిలినట్టుగా నటిస్తూ.. ఆ వ్యక్తి తన కాలికి మొత్తం కట్లు కట్టాడు. ఆ బ్యాండేజీల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌ చేయాలని చూశాడు. కానీ, కస్టమ్స్‌ అధికారుల స్కానింగ్‌లో ఈ బంగారం దొరికిపోయింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేస్తున్నారు.


Also Read: విశాఖలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్.. పాల సముద్రం లాంటి లుక్‌తో మైమరచిపోవచ్చు! ఈ టైంలో ది బెస్ట్


ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌ పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్‌ స్టాంపులు, విదేశాల్లో ఉన్న సమయం తదితర విషయాలు పరిగణనలోకి తీసుకొని అనుమానితుల్ని కస్టమ్స్ అధికారులు గుర్తిస్తున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు రోజుకో కొత్త ఉపాయాన్ని కనుగొంటున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి పన్ను పైకి, రూపాయి విలువ పతనం కావడమే ఈ స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 






294 కిలోల గంజాయి స్వాధీనం
మరోవైపు, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు నార్మోటిక్ డ్రగ్స్‌ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు చౌటుప్పల్‌ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 43.54 లక్షలు ఉంటుందని చెప్పారు. భువనగిరి ఎస్‌వోటీ, రామన్న పేట పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read: AP PRC Issue: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


Also Read: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి