Covid 19 India Cases: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 1,79,723 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 146 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగింది.
రోజువారీ పాజిటివిటీ రేటు: 13.29%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 7,23,619
భారత్‌లో రికవరీ రేటు: 96.62 శాతం
4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజులో మరో 410 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లోనమోదైన వాటితో కలిపితే దేశంలోని మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 4,033కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటివరకూ 1,552 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న క్రమంలో కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. తమిళనాడు సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
Also Read: Fake News: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం
అత్యధికంగా మహారాష్ట్రలో 1216 కేసులు నమోదు కాగా, ఢిల్లీ 513, కర్ణాటక 441, రాజస్థాన్ 529, కేరళ 333, గుజరాత్ 236, తమిళనాడు 185, హర్యానా 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇదివరకే 454 మంది, రాజస్థాన్ 305, తమిళనాడులో 185 మంది, గుజరాత్ 186 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.
151.94 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజులో 60 లక్షల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. దీంతో భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 151.94 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 15 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయి. అనుమతి లభించడంతో 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు. నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ టీకాలు ఇస్తున్నారు.
Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి