రెండు రోజుల క్రితం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో సూసైడ్ లేఖతో పాటు ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటికి వచ్చాయి. తాము ఆత్మహత్య చేసుకొనేందుకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని బాధితుడు అందులో తెలిపారు. గణేష్‌కుమార్‌, వినీత, చంద్రశేఖర్‌, సాయి రామ మనోహర్‌ పేర్లను బాధితుడు సూసైడ్ లేఖలో రాశాడు. ఆ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ పెద్ద అయిన పప్పుల సురేశ్‌ కోరారు. జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి అధిక వడ్డీల కోసం తనపై ఒత్తిడి తెచ్చాడని వివరించారు. అతనికి రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించాలని చెప్పారు. వడ్డీలు చెల్లించకపోతే తమ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించినట్లు సురేశ్‌ వీడియోలో వాపోయారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల పేర్లతో సంతకం కూడా చేయించుకున్నట్లు తెలిపారు.


వడ్డీల కోసం గణేశ్‌ అనే వ్యక్తి కూడా తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. గణేశ్‌కు అప్పటికే తాను రూ.82 లక్షల వరకు ఇచ్చానని సెల్ఫీ వీడియోలో వాపోయారు. కొవిడ్‌ పరిస్థితుల్లో వ్యాపారం కోసం డబ్బు అప్పు తీసుకున్నామని.. వారు వడ్డీల మీద వడ్డీలు కట్టాలని తీవ్రంగా వేధించారని సురేశ్‌ వీడియోలో చెప్పారు. గూండాలు, రౌడీలతో తమపై దాడి చేయిస్తామని కూడా వారు బెదిరించారని తెలిపారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. 


Also Read: Hyderabad: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..


ఈ ఘటనపై మృతుడు సురేష్‌ బావమరిది రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మా అక్క, బావ, ఇద్దరు మేనల్లుళ్లు సూసైడ్‌ చేసుకోవడానికి ఆ నలుగురు వ్యక్తులే కారణం. వారి వడ్డీ వేధింపుల వల్లే విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు కట్టకపోతే అంతం చేస్తామని బెదిరించారు. సూసైడ్‌ నోట్‌లో కూడా ఇదే విషయాన్ని రాశారు. వాళ్లు చనిపోయేముందు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మొత్తం సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఆ నలుగురి వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి’’ అని రాంప్రసాద్‌ మీడియాతో అన్నారు.


నిజామాబాద్ నుంచి విజయవాడకు వచ్చి ఆత్మహత్య
విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌, భార్య శ్రీలత, కుమారులు అఖిల్‌, ఆశీష్‌లు రెండ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సురేశ్‌ కుమారుడు బలవన్మణానికి సంబంధించి ఆడియో మెసేజ్‌ బంధువులకు పంపాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ నలుగురి అంత్యక్రియలు నిజామాబాద్‌ ఆర్యవైశ్య శ్మశానవాటికలో బంధువులు పూర్తి చేశారు.


Also Read: విశాఖలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్.. పాల సముద్రం లాంటి లుక్‌తో మైమరచిపోవచ్చు! ఈ టైంలో ది బెస్ట్


Also Read: AP PRC Issue: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


Also Read: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి