సినిమా ఇండస్ట్రీలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మహేష్ బాబు, బండ్ల గణేష్, తమన్, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఇషా చావ్లా కూడా కరోనా బారిన పడినట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపింది.  ‘నేను కోవిడ్ బారిన పడింది. లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. మెడికల్ గైడెన్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాను. అందరికీ నాకు పాజిటివ్ వచ్చిన తెలిపాను. ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే.... అందుకే ఈ పోస్టు పెడుతున్నాను,  సురక్షితంగా ఉండండి’ అని పోస్టు పెట్టింది. 


ఇషా చావ్లా ఢిల్లీకి చెందిన నటి. ప్రేమ కావాలి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సాయికుమార్ కొడుకు ఆదికి తొలిసినిమా అది. 2011 ఆ సినిమా విడుదలైంది. తరువాత పూల రంగడు, శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లికొడుకు, జంప్ జిలాని వంటి సినిమాల్లో నటించింది. కానీ తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఈ ఢిల్లీ పిల్ల. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్లో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.  


బిగ్ బాస్ 5 సీజన్లో ఈమె కూడా ఒక కంటెస్టెంట్ అనే వార్తలు వచ్చాయి. అయితే అదే సమయానికి ఆమె కరోనా బారిన పడినట్టు కొన్ని పుకార్లు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు కానీ, ఇషా బిగ్ బాస్ సీజన్5లో కనిపించలేదు. ఇలాగే అవకాశాలు రాకుండా ఉంటే వచ్చే సీజన్లో బిగ్ బాస్లో కనిపించే ఛాన్సులు ఉన్నాయి.




Also Read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి


Also Read: కోలీవుడ్ హీరోకి కోవిడ్.. రిలాక్స్ అయిన రవితేజ ఫ్యాన్స్..


Also Read: సీనియర్ నటుడికి కరోనా.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..