ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975లో తొలిసారిగా జనవరి 10న ప్రపంచ హిందీ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సును దృష్టిలో పెట్టుకుని 2006లో మొదటిసారిగా ‘ప్రపంచ హిందీ దినోత్సవాన్ని’అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అప్పట్నించి ప్రతి ఏడాది ‘వరల్డ్ హిందీ డే’ను నిర్వహిస్తున్నారు. చాలా మంది హిందీని మనదేశ జాతీయ భాషగా అనుకుంటారు. కానీ అది మన అధికార భాష మాత్రమే. ఆంగ్లంతో పాటూ ఆ స్థానాన్ని హిందీ పంచుకుంటోంది. జాతీయ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. ఎందుకంటే మన దేశంలో ఎన్నో భాషలు, సంస్కృతులు కలిసి విభిన్న దేశం. కానీ కేంద్రం మాత్రం అధికార భాషలుగా హిందీ, ఆంగ్లాన్ని ఉపయోగిస్తోంది. 


ఆసక్తికరమైన నిజాలు...
1. భారతదేశంలోని ఉత్తరభాగంలో హిందీనే అధికంగా మాట్లాడుతారు. అంతేకాదు మారషస్, ఫిజీ, గయానా, సురినామ్ ట్రినిడాడ్ అండ్ టోబాగో, నేపాల్ ప్రాంతాల్లో కూడా హిందీ మాట్లాడే వారు ఉన్నారు. 
2. ఇంగ్లిష్ హింది నుంచి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. అవతార్, బందన్నా, బంగళా, డింగీ, గురు, జింగిల్, ఖాకీ, కర్మ, లూట్, మంత్రం, నిర్వాణ, పంచ్, పైజామా, షర్బత్, షాంపూ, థగ్, యోగా వంటి పదాలు హిందీ నుంచి తెచ్చుకున్నవే. 
3. హిందీ వర్ణమాలలోని ప్రతి అక్షరం దాని సొంత, విభిన్నమైన ధ్వనిని కలిగి ఉంటుంది. ఈ భాషను సులభంగా నేర్చుకోవచ్చు. 
4. ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాషల్లో హిందీ అయిదో స్థానంలో ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 366 మిలియన్ల మంది ప్రజలు మాట్లాడుతున్నారు. 
5. 1881లో బీహార్ హిందీని తమ రాష్ట్ర ఏకైక అధికారకి భాషగా ప్రకటించింది. ఉర్దూ స్థానంలో హిందీని  అధికారిక భాషగా స్వీకరించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. 
6. రాజ్యాంగ అసెంబ్లీ 1949లో సెప్టెంబర్ 14న హిందీని కేంద్ర అధికార భాషగా స్వీకరించింది. అందుకే ఆ రోజును హిందీ దివస్‌గా నిర్వహించుకుంటారు. 
7. వెడ్ అడ్రస్‌లు రూపొందించడానికి ఉపయోగించే ఏడు భాషల్లో హిందీ కూడా ఒకటి.  


Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం


Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు


Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు


Also read: బరువు తగ్గించి, శక్తిని పెంచే ప్రోటీన్ షేక్.. ఇంట్లో ఇలా సులువుగా తయారుచేయచ్చు


Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే




 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.