తమిళ నటుడు విష్ణు విశాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2022 పాజిటివ్ రిజల్ట్ తో మొదలైందని.. తనకు కోవిడ్ వచ్చిందని చెప్పారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరినీ జాగ్రత్తగా ఉండమని సూచించారు. విపరీతమైన ఒళ్లు నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు.
జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో పాటు జ్వరం కూడా వచ్చిందని.. దీని నుంచి బయటపడతానని అనుకుంటున్నట్లు చెప్పారు. విష్ణు విశాల్ ఈ విషయం చెప్పిన వెంటనే రవితేజ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జనవరి 7న మాస్ మహారాజా రవితేజతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు విష్ణు విశాల్. రవితేజతో కలిసి సినిమా చేయబోతున్నట్లు చాలా ఎగ్జైటెడ్ గా చెప్పారు.
దీంతో రెండు రోజుల క్రితమే విష్ణు విశాల్.. రవితేజని కలిశారా..? అంటూ అభిమానులు విష్ణు విశాల్ ను ప్రశ్నించగా.. దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. అది పాత ఫొటో అని.. భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ టెన్షన్ కాస్త తగ్గింది. ఇక విష్ణు విశాల్ తెలుగులో విడుదలైన 'అరణ్య' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్..
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి.