ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తరువాత.. తన ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకొని లైఫ్ లో బిజీ అయిపోయింది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలకు పని చేసింది. ఇదే సమయంలో ఆమె మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఏరోజు కూడా ఆమె వెనక్కి తగ్గకుండా.. క్వాలిటీ లైఫ్ జీవించింది. ఇదిలా ఉండగా.. మాంగో మీడియా అధినేత రామ్.. ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నారు. 


అదే విషయాన్ని ఆమెకి చెప్పి ఒప్పించారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించడంతో 2021 జనవరి 9న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సునీత ఇద్దరు పిల్లలు ఆకాష్, శ్రియ దగ్గరుండి తల్లికి పెళ్లి చేశారు. వివాహం తరువాత సునీత జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కొత్త బంధాన్ని ఆశ్వాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ లు పెడుతోంది. 


ఈరోజు సునీత-రామ్ ల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. దీంతో సునీత సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది. 'మనం ఆశలన్నీ వదులుకున్నప్పుడు ప్రేమ వెతుక్కుంటూ మన దగ్గరకి వస్తుంది. మా ఇద్దరి విషయంలో ఇదే జరిగింది. ప్రతి పెళ్లి వెనుక ఓ కథ ఉంటుంది' అంటూ తన వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని మెమొరీస్ ను వీడియో రూపంలో షేర్ చేసింది. 


ఇందులో సునీత పెళ్లి సమయంలో తీసిన కొన్ని బిట్స్ ను వీడియోగా తయారు చేశారు. ఇందులో సునీత తన భర్త రామ్ గురించి గొప్పగా మాట్లాడింది. అతడు చాలా హానెస్ట్ గా ఉంటాడని.. ఏ విషయాన్నైనా స్ట్రెయిట్ గా చెబుతాడని.. రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ మురిసిపోయింది.   







Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..