తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఒక్కొక్కరుగా కొవిడ్ బారిన పడుతున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ తరువాత తెలంగాణతో పాటు దేశంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ మహేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఆయనకు కాస్త నలతగా అనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. కొవిడ్ టెస్టుల్లో మహేందర్ రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు టీఆర్ఎస్ నేత తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మహేందర్ రెడ్డి తెలిపారు.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 2,606 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. అదే సమయంలో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,041కి చేరింది. కరోనా నుంచి శుక్రవారం 285 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1583 కేసులు నమోదయ్యాయి.
Also Read: New Variant: ఒమిక్రాన్ - డెల్టా రకాల లక్షణాలతో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’,ఏ దేశంలో బయటపడిందంటే...
Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి