ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కోవిడ్ రూల్స్ మాత్రం పక్కాగా పాటించాలని నిర్ణయించుకుంది. కోవిడ్ కారణంగా ఈ సారి ఎన్నికల్లో వచ్చే మౌలిక మైన మార్పు ఆన్ లైన్ నామినేషన్లు. ఐదు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు స్వీకరిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
అదే సమయంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈసీ కఠినమైన ఆంక్షళు పెట్టింది. జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేశారు. పాదయాత్రలు, రోడ్ షోలకు కూడా అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతానికి జనవరి పదిహేను వరకే ఆంక్షలు అని చెప్పినప్పటికీ కరోనా ఉద్ధృతి ఇప్పుడే పెరుగుతున్నందున ... ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ ఆంక్షలు కొనసాగించే అవకాశం ఉంది.
Also Read: ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను 16శాతం పెంచారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచారు. ఇక పోలింగ్ విధుల్లో పాల్గొనేవారికి ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించి.. వారికి కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ సారి ఎన్నికల ప్రచారం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ర్యాలీలతో హోరెత్తించినపార్టీలు.. ఆక ఆన్ లైన్ ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఎన్నికలంటే ర్యాలీలు... ప్రచారాలు కామన్.. ఈ సారి మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ సందడి కనిపించడం కష్టమే.
Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?
నామినేషన్లను కూడా ఆన్‌లైన్‌లో దాఖలుచేసేఅవకాశం కల్పించడంతో ర్యాలీలు చేసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికే కరోనా కేసులు భారీగా పెరుగుతూండటంతో ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. ఎన్నికలు భారీగా జనసమూహం గుమికూడే కార్యక్రమం కావడంతో అలాంటి వాటికి చాన్సివ్వకూడదన్న ఆలోచనలో సీఈసీ ఉంది. దానికి తగ్గట్లుగానే ఆంక్షలు ఉన్నాయి
.
Also Read: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి