డెల్టా వేరియంట్ ధాటికి తట్టుకుని బయటపడ్డామనుకుంటే, ఒమిక్రాన్ వైరస్ దాడి చేసింది. ఇప్పుడు ఈ వైరస్ ధాటికి మళ్లీ దేశాలు భయపడుతున్నాయి. చాలా దేశాల్లో ఆఫీసులు, విద్యాసంస్థలు మూసివేస్తున్నారు. ఇప్పుడు కలవరపెట్టే మరో విషయం బయటపడింది. సైప్రస్ దేశంలోని పరిశోధకులు డెల్టా, ఒమిక్రాన్ వైరస్‌లు మిళితమైన కొత్త కరోనా వేరియంట్‌ను కనుగొన్నట్టు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. సైప్రస్ విశ్వవిద్యాలయంలో బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ లియోంటియోస్ కోస్ట్రికిస్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ను కనుగొన్నారు. డెల్టా జన్యువులలో ఒమిక్రాన్ వంటి జెనెటిక్ సిగ్నేచర్చ్ కనిపించాయి. అందుకే దీనికి డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు.







పరిశోధన ప్రకారం కోస్ట్రికిస్, అతని బృందం సైప్రస్ దేశంలో దాదాపు  పాతిక ‘డెల్టాక్రాన్’ వైరస్ కేసులను కనిపెట్టారు. ఇంకా ఎన్ని కేసులు బయటపడతాయో, ఈ కొత్త వైరస్ ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేము అంటున్నారు కోస్ట్రికిస్. ‘డెల్టా, ఓమిక్రాన్ అనే రెండు డేంజరస్ వేరియంట్ల కలగలిగిన ఈ కొత్తరకం మరింతగా వ్యాపిస్తుందా, ప్రమాదకరమైనా అనే కొన్ని పరిశోధనల తరువాత చెప్పగలం’ అన్నారాయన. 


బ్లూమ్‌బెర్గ్ చెప్పిన ప్రకారం పరిశోధకులు తమ అధ్యయన ఫలితాలను వైరస్‌లను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అనుసరిస్తూ డెల్టాక్రాన్ వేరియంట్ త్వరలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విశ్లేషణ ప్రకారం అమెరికాలో ప్రతి రోజూ 6,00,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది మునుపటితో పోలిస్తే 72శాతం పెరిగినట్టు. 


గమనిక: జలుబు, ఫ్లూ, కోవిడ్ వేరియెంట్స్ లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి మీలో కనిపించినా తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మీరు తగిన చికిత్స పొందగలరు. పై వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. వైద్యానికి, కరోనాను గుర్తించడానికి ప్రత్యామ్నాయాలు కాదని గమనించగలరు. 


Also read: కోవిడ్ వేరియెంట్స్-జలుబు-ఫ్లూ మధ్య వ్యత్యాసం ఏమిటీ? కరోనాను ఎలా గుర్తించాలి?
Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు
Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...
Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు
Also read:
 అప్పుడప్పుడు వచ్చి పోయే ఈ లక్షణాలు చాలా ప్రమాదకరం, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి