లి కాలంలో జలుబు రావడం సహజమే. కొందమందికి వైరల్ ఫీవర్లు కూడా వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి జ్వరాలకు పెద్దగా భయపడేవాళ్లం కాదు. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అనే ధైర్యం ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. కోవిడ్-19 వైరస్ ఉనికిలోకి వచ్చిన రోజు నుంచి.. చిన్న జలుబు వచ్చినా.. అమ్మో.. కరోనా వచ్చేసిందేమో అనే భయం పట్టుకుంటోంది. వెంటనే కోవిడ్ పరీక్షలకు పరిగెడుతున్నారు. నెగటివ్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు. జలుబు, జ్వరాలను కరోనాగా అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే.. వెంటనే చికిత్స పొందటం సాధ్యమవుతుంది. కానీ, జలుబు, జ్వరం వచ్చిన ప్రతిసారి.. RTPCR టెస్టులకు పరుగులు పెట్టలేం కదూ. అందుకే.. జలుబు, జ్వరం, కోవిడ్ లక్షణాలకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని అవగాన కోసం తెలుసుకోవడం చాలా అవసరం. 

COVID-19 అనేది SARS-CoV-2 వైరస్‌తో సంక్రమించడం వల్ల సంక్రమించే శ్వాసకోశ వ్యాధి. కోవిడ్ సంక్రమించిన వ్యక్తికి కనీసం 5 అడుగుల దూరంలో ఉన్నా.. వైరస్ సోకుతుంది. ఎవరైనా శ్వాస వదిలినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా పాడినప్పుడు విడుదలయ్యే తుపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వారికి సమీపంలో ఉండే వ్యక్తులు నోరు లేదా ముక్కు ద్వారా వాటిని పీల్చితే వైరస్ సోకుతుంది. అందుకే.. ఇతరులతో కనీసం ఆరు అడుగులు లేదా రెండు మీటర్ల భౌతిక దూరాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకి.. ఆ చేతులతో నోరు, ముక్కు, కళ్లను టచ్ చేసినా.. కోవిడ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అందకే.. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, ఫ్లూ దాదాపు కోవిడ్ డెల్టా, ఒమిక్రాన్ వేరియెట్ల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి.. వాటిలో ఏ ఒక్క లక్షణం కనిపించిన కోవిడ్ పరీక్ష చేయించుకుని వైద్యం అందుకోవాలి. 

COVID-19 సోకినవారిలో కనిపించే ప్రధాన లక్షణాలు.. తీవ్ర జ్వరం, నిరంతర దగ్గు, అలసట, రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడటం. అయితే, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌లో మాత్రం ఆ లక్షణాలు లేవు. ఒమిక్రాన్ సోకినవారిలో జలుబు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముక్కు కారడం, తలనొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాబట్టి.. మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్-19 డేల్టా, ఒమిక్రాన్, జలుబు, ఫ్లూ(influenza virus)  మధ్య ఉండే వ్యత్యాసం కింది టేబుల్‌లో చూడండి. 

లక్షణాలు డెల్టా  జలుబు ఒమిక్రాన్ ఫ్లూ
దగ్గు పొడిగా ఉంటుంది అరుదు ఉండదు ఉంటుంది
కండరాల నొప్పి ఉంటుంది ఉండదు ఉండదు ఉంటుంది
అలసట ఉంటుంది   అరుదు ఉండదు ఉంటుంది
ముక్కు కారడం అరుదు  అరుదు ఉంటుంది ఉంటుంది
గొంతు నొప్పి ఉంటుంది  ఉంటుంది ఉంటుంది ఉంటుంది
జ్వరం ఉంటుంది అరుదు అరుదు ఉంటుంది
తలనొప్పి ఉంటుంది   అరుదు ఉంటుంది అరుదు
డయేరియా అరుదు   ఉండదు ఉండదు పిల్లల్లో ఉంటుంది 
వికారం/వాంతులు అరుదు  ఉండవు ఉండవు పిల్లల్లో ఉంటుంది
రుచి, వాసన కోల్పోవడం ఉంటుంది  అరుదు ఉండదు అరుదు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  ఉంటుంది  అరుదు  ఉండదు ఉంటుంది

Also Read: హతవిధీ.. హంతకుడికి ముద్దు పెట్టిన లేడీ జడ్జి.. కెమేరాకు చిక్కిన రొమాన్స్! 

గమనిక: జలుబు, ఫ్లూ, కోవిడ్ వేరియెంట్స్ లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి మీలో కనిపించినా తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మీరు తగిన చికిత్స పొందగలరు. పై వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. వైద్యానికి, కరోనాను గుర్తించడానికి ప్రత్యామ్నాయాలు కాదని గమనించగలరు. 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి