Weather Updates: ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గినట్లు కనిపించి రెండు రోజులుగా పెరుగుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కళింగపట్నంలో 16.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నందిగామలో 17.8 డిగ్రీలు, బాపట్లలో 18.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.4 డిగ్రీలు మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో అంతగా మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది.
ఏపీలోని రాయలసీమలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. ఆరోగ్యవరంలో కనిష్టంగా 18 డిగ్రీలు, కర్నూలులో 21.2 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీలు, అనంతపురంలో 20.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో రెండు వైపుల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
Also Read: Corona Cases: ఢిల్లీ, ముంబయిలోనే 40 వేలకు పైగా కరోనా కేసులు.. బెంగాల్‌లోనూ పరిస్థితి