'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇంకా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. 'రాధేశ్యామ్' సినిమాకి నార్త్ లో ఉన్న బజ్ తెలుగులో లేదనే చెప్పాలి. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లో ఎప్పుడు చూద్దామా..? అని వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో ఊహించనంత మార్పు వచ్చింది. ఆయన బ్రాండ్ విలువ పెరిగింది. అయితే మిగిలిన హీరోల మాదిరి తన బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకోవడం లేదు. ఇటీవల తనకు చాలా కమర్షియల్ ఆఫర్లు వచ్చాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభాస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని భారీ ప్రయత్నాలు చేశాయి.
వందల కోట్లు ఆఫర్లు ఇస్తామని చెప్పాయి. కానీ ప్రభాస్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా వందల కోట్ల రూపాయల ఆఫర్లను కాదన్నాడని సమాచారం. నిజానికి కమర్షియల్ యాడ్స్ లో భారీగా సంపాదించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. యాడ్స్ లో నటించడానికి నెలలు, సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది.
అందుకే హీరోలు తమ క్రేజ్ ని యాడ్స్ రూపంలో క్యాష్ చేసుకుంటూ ఉంటారు. తమ చేతిలో ఎన్ని బ్రాండ్స్ ఉంటే అంత వాల్యూ అని అనుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు ఈ హీరో. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ లో మరో సినిమా చేయబోతున్నారు.
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..
Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..
Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..