మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు‌ కుప్పం‌ పర్యటనపై నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (డిసెంబరు 9) ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో నగరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా, సినీ గాయని ఎస్పీ శైలజ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆర్.కే. రోజా మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు నాయుడు కుప్పం చుట్టూ గిరా గిరా అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి తన సొంత నియోజకవర్గం కుప్పంను.. అక్కడి ప్రజలను అభివృద్ధి చేయాలని ఏనాడైనా చంద్రబాబుకు ఆలోచన వచ్చిందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. కుప్పం ప్రజలకు నీరు ఇవ్వాలని, స్థానికంగా ఇల్లు కట్టుకుని గర్వంగా ఉండాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. 


నిత్యం వైఎస్ జగన్ పై, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లే చంద్రబాబుకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఆయనకు పైన ఉన్న కళ్ళు కిందకి జారిపోయాయి అంటూ రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబుకు అన్ని ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారన్న తెలిసిపోయిందని, అందుకే మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కానీ, కుప్పం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని.. ఆ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని అన్నారు. కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నిలబడితే ప్రజలు ఏ వైపు ఉన్నారో తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా జగనన్న పెద్దదిక్కుగా మారి ప్రజలను ఆదుకున్నారని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తున్నట్లు రోజా వివరించారు.


Also Read: నెల్లూరులో నయా ట్రెండ్.. ఈ హాట్ చిక్ టేస్ట్ చేస్తే మైమరచిపోవాల్సిందే.. వంట కూడా స్కూటర్ మీదే..


Also Read: TDP One Side Love : ఏపీలో ట్రయాంగిల్ పొలిటికల్ లవ్ స్టోరీ ! క్లైమాక్స్ మలుపు తిప్పుతుందా ?


Also Read: AP Farmers: ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు.. త్వరలోనే సబ్సిడీ, పంటలకు రుణాలు


Also Read: Crime News: ఇద్దరు సత్రంలో.. మరో ఇద్దరు కృష్ణానదిలో.. విజయవాడలో తెలంగాణవాసుల సూసైడ్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి