నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ సినిమా అంటూ తెగ పొగిడేస్తున్నారు. 

 

సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను చూశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 'మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో బ్రిలియంట్ సినిమా ఇది. 'శ్యామ్ సింగరాయ్' అద్భుతమైన అనుభూతి. నాని, సాయి పల్లవి కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫార్మన్స్. కృతి శెట్టి, మడోనాలకు కంగ్రాట్స్. చిత్రబృందానికి కుదోస్' అంటూ రాసుకొచ్చారు. 

 

ఈ ట్వీట్ చూసిన కృతిశెట్టి చాలా ఎగ్జైటెడ్ గా చరణ్ కి రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈపాటికి చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ హీరో శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 







Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం..


Also Read: రామ్.. మంచి కాఫీ లాంటి అబ్బాయ్.. భర్తపై ప్రేమ కురిపించిన సునీత..


Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..




 


 





































ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.