కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరు.  మంత్రిగా కూడా పనిచేశారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కూడా ఇరుక్కుని జైలు పాలయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటూ జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదల అయ్యారు. కాగా ఇప్పుడు గాలి జనార్థన రెడ్డి కొడుకు కిరిటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ఎన్నో నెలల పాటూ నటనలో, ఫైటింగులు, డ్యాన్సులలో శిక్షణ తీసుకున్నారు కిరీటి. ఇతడు కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాలో నటించబోతున్నారు. కొడుకును హీరోగా చేయాలన్నది గాలి జనార్థన రెడ్డి కోరిక. ఇప్పుడు అతడి కోరిక తీరబోతోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. 


కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా జాకీ అంటే కిరీటికి చాలా ఇష్టం. ఆ సినిమా స్పూర్తితోనే హీరోగా మారినట్టు దర్శకుడు  రాధాకృష్ణ చెప్పారు. కిరీటి హీరోగా చేయబోయే సినిమా నిర్మాతగా వ్యవహరించేది తెలుగు నిర్మాత సాయి కొర్రపాటి. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. 


హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ ‘నేను యూకెలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతూనే మరోపక్క నటనలో కూడా కోర్సును పూర్తిచేశాను. మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తితో అన్ని రకాల ఫైట్స్ చేసేందుకు శిక్షణ తీసుకున్నాను. నటనతో పాటూ యాక్షన్ సన్నివేశాలు చేయగలగడంవల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. నేను డూప్ లేకుండా యాక్షన్ సీన్లలో నటించాలనుకుంటున్నాను. గత ఆరు నెలలుగా కేవలం యాక్షన్ సన్నివేశాలు చేసేందుకు స్టంట్లపై శిక్షణ పొందాను’ అని చెప్పుకొచ్చాడు కిరీటి. 


Also Read: మ‌గాళ్ల‌కు మంచి టిప్‌... అదీ పెళ్లి త‌ర్వాత భార్య‌తో బాల‌కృష్ణ చేసుకున్న‌ అగ్రిమెంట్!
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజ‌శేఖ‌ర్‌ భావోద్వేగం... జీవిత కన్నీరు
Also Read: డేంజర్ ముందుంది... ఆ డేంజర్ పేరు రాకీ భాయ్... వేసవిలో!