తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 70,697 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1825 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,043కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 14,995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1042  కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి ఆదివారం 351 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,76,817కి చేరింది. 



Also Read: భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 4 వేలు దాటిన పాజిటివ్ కేసులు, తాజాగా 146 మరణాలు


ఏపీలో కరోనా కేసులు


ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,280 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 984 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 152 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 5606 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం 


దేశంలో కరోనా కేసులు


న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 1,79,723  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 146 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,23,619కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగింది.


Also Read:  ఏపీలో కొత్తగా 984 కోవిడ్ కేసులు... 5 వేలు దాటిన యాక్టివ్ కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి