ఒమిక్రాన్ లక్షణాలు సాధారణంగానే ఉన్నాయని ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో ఒమిక్రాన్ కాకపోయినా సాధారణ కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇలాంటి వారిలో ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ రేటు ఐదు నుంచి పది శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో ఇది రెండు, మూడుశాతం ఉండేది. ఇప్పుడు ఐదు శాతం దాటిపోయింది. 


 





Also Read: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్


కరోనా రెండో దశలో డెల్టా విజృంభణ సమయంలో  ఆస్పత్రి పాలయ్యే వారి సంఖ్య 23 శాతానికన్నా ఎక్కువగా ఉండేది. రెండో  దశతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ శాతంలోనే ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య ఉన్నప్పటికీ .. ఇంకా మూడో దశ ప్రాథమిక స్థాయిలోనే ఉన్న కారణంగా ముందు ముందు పరిస్థితిని అంచనా వేయడం కష్టమని కేంద్రం  భావిస్తోంది. పరిస్థితుల్ోల చాలా వేగంగా మార్పు వస్తోందని ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు వేగంగా పెరిగిపోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా


ఒమిక్రాన్ కేసులు  ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ జీనోమ్ సీక్వెన్సింగ్ సౌకర్యాల లోటు వల్ల పూర్తి స్థాయిలో వైరస్‌ను టిటెక్ట్ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆ వైరస్ శరవేగంగా విస్తరిస్తోదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆస్పత్రులు... ఆక్సీజన్ సహా ఇతర వైద్య సౌకర్యాలను అందుబాటులోకి ఉంచుకోవాలని ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎప్పటికప్పుడు కేంద్రం మానిటరింగ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. 



Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి