రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.
ప్రముఖులకు కరోనా..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకగా థర్డ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరందరికీ ఇటీవల కరోనా వచ్చింది.
- దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్
- రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్
- భాజపా ఎంపీ వరుణ్ గాంధీ
- మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు.
పీక్ స్టేజ్..
దేశంలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొంతమంది నిపుణులు అంటున్నారు. కానీ ఒమిక్రాన్ కారణంగా వచ్చే థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉంటే రోజుకి 10 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదట్లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (IISc-ISI) తెలిపింది.
IISc-ISIకు చెందిన ఫ్రొఫెసర్ శివ ఆత్రేయ, ఫ్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం చేసింది. అయితే థర్డ్ వేవ్ పీక్ దశ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉందని వీరు తెలిపారు. మార్చి మొదటి నుంచి మళ్లీ కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు.
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!