ఓవైపు కరోనా రోజువారి కేసులు లక్షకు పైగా నమోదవుతోన్నా.. ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్నా.. తమిళనాడు సర్కార్ తగ్గేదేలే అంటోంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా భావిస్తోన్న జల్లికట్టు నిర్వహణకు స్టాలిన్ సర్కార్ ఓకే చెప్పింది. అయితే జల్లికట్టు నిర్వహణకు ప్రత్యేక ఎస్‌ఓపీని (ప్రామాణిక నిర్వహణా విధానం) తయారు చేసింది.







ఇవే రూల్స్..


జల్లికట్టు చూసేందుకు కేవలం 150 మందిని మాత్రమే అనుమతిస్తారు లేదా 50 శాతం సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉండాలి.


కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు లేదా 48 గంటల లోపు పరీక్షించిన నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి చూపించాలి.


కరోనా కారణంగా..


కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న కారణంగా ఈ నెలలో జరగాల్సిన యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పటికే కళాశాలలకు స్టడీ హాలిడేస్ ఇచ్చింది ప్రభుత్వం.


తమిళనాడులో కొత్తగా 12,895 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 51,335కు పెరిగింది. మరో 12 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 36,855కు పెరిగింది. గత 24 గంటల్లో 1,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  


Also Read: Rajnath Singh Corona Positive: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్


Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి