సినీ నటుడు సిద్ధార్థ్ రాజకీయ అంశాలపై చురుగ్గా స్పందిస్తూ ఉంటారు. ఆయన ట్వీట్లు అటు తమిళనాడుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హైలెట్ అవుతూ ఉంటాయి. వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆయన ఇటీవల బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారానికి కారణం అవుతున్నాయి. దేశానికి ఒలిపింక్ మెడల్ అందించిన సైన్ నెహ్వాల్‌పై సిద్ధార్త్ అసభ్య పదజాలంతో దూషించారని ఆయనపై సైనా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 


Also Read: సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారు... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు !


పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెక్యూరిటీ బ్రీచ్ అంశం రాజకీయ దుమారంగా మారింది. దీనిపై చాలా మంది తమ స్పందన వ్యక్తం చేశారు. అలాగే సైనా నెహ్వాల్ కూడా ఓ ట్వీట్ పెట్టారు. మోడీ సెక్యూరిటీ బ్రీచ్‌ను ఖండించారు. 


 






Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


అయితే సిద్ధార్థ్ ఈ మొత్తం ఎపిసోడ్‌ను రాజకీయంగా చూస్తున్నారు. రైతులకు మద్దతుగా ఆయన గతంలో చాలా ట్వీట్లు చేశారు. ఇప్పుడు కూడా ప్రధానికి వ్యతిరేకంగా ... రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ బ్రీచ్ అంశంలో మోడీకి మద్దతుగా ట్వీట్లు పెడుతున్న వారిని సిద్ధార్థ్ సెటైరికల్‌గా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో  సైనా నెహ్వాల్‌పైనా విమర్శలు గుప్పించారు.  ఆమెను "కాక్ ఛాంపియన్‌" గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. 


 






Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


ఈ  ట్వీట్‌ బూతు అర్థం వచ్చేలా ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్ ఒలింపిక్ చాంపియన్ పట్ల లిమిట్స్ క్రాస్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. సైనా నెహ్వాన్ భర్త ..మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కూడా  సిద్ధార్థ్‌కు ఇది మంచి లాంగ్వేజ్ కాదని ట్వీట్ చేశారు. 


 






Also Read: అవును... సమంతకు ఆ సమస్య ఉంది!


ఇక ఇలాంటి అంశాలపై చురుగా స్పందించే చిన్మయి శ్రీపాద కూడా సిద్ధార్థపై మండిపడ్డారు. అయితే తన మాటలను సమర్థించుకుంటూ సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. కానీ ఈ అంశంపై నెటిజన్ల వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి. అది బూతా.. కాదా అన్నదానిపై చర్చింలు సాగుతూనే ఉన్నాయి. ఈ అంశం రాజకీయం అంశం కూడా అయింది. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై సీరియస్ అయింది. కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర పోలీసుల్ని ఆదేశించింది. సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు లేఖ రాశారు. 


Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.