భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడనున్నట్లు ఏబీపీ న్యూస్ సమాచారం.
సెంచూరియన్, జొహెన్స్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లకు ముందు కూడా విరాట్.. ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లలో మీడియాతో మాట్లాడలేదు. అందులోనూ రెండో టెస్ట్‌లో వెన్నునొప్పి కారణంగా విరాట్ దూరమయ్యాడు.
ద్రవిడ్ హింట్..
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ మీడియా సమావేశాల్లో ఎందుకు మాట్లాడటం లేదో కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల చెప్పాడు. వందో టెస్టు మ్యాచ్ ముందు అతడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాడని పేర్కొన్నాడు. వాండరర్స్ టెస్టులో అతడు భారీ పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టుకు ముందు ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
'మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశాల్లో కోహ్లీ గైర్హాజరు అవ్వడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. దీనిపై నేను నిర్ణయం తీసుకోను. వందో టెస్టు ముందు అతడు మీతో మాట్లాడతాడు. దానిని మీరు వేడుక చేసుకుంటారనే అనుకుంటున్నా. పైగా మీరు అందులో వందో టెస్టు గురించి ప్రశ్నలు అడగొచ్చు' అని ద్రవిడ్ అన్నాడు.
కానీ ఆడలేదు..
కానీ అనూహ్యంగా రెండో టెస్ట్ మ్యాచ్ కోహ్లీ ఆడలేదు. వెన్నునొప్పి కారణంగా దూరమైనట్లు ద్రవిడ్ చెప్పాడు. కేప్ టౌన్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ మాట్లాడతాడని ద్రవిడ్ అన్నాడు.
రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు కనుక విరాట్ కోహ్లీకి కేప్ టౌన్ మ్యాచ్.. 99వది కానుంది. అయితే ఇటీవల జరిగిన పలు వివాదాల గురించి విరాట్ కోహ్లీని మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది. మరి ఈ ప్రశ్నలకు విరాట్ ఎలా సమాధానమిస్తాడో చూడాలి.
రికార్డ్‌కు చేరువలో..
దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారతీయుల జాబితాలో రెండో స్థానానికి చేరేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. రాహుల్ ద్రవిడ్ 11 మ్యాచుల్లో 624 పరుగులు చేయగా కోహ్లీ 6 మ్యాచుల్లో 611 పరుగులు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే చాలు. ఇక సచిన్ తెందూల్కర్ 15 మ్యాచుల్లో 1161 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రికార్డును బద్దలు చేయడం అంత సులభం కాదు.
Also Read: IND vs SA: కేప్‌టౌన్‌లో చెమటోడుస్తున్న కోహ్లీ..! ద్రవిడ్ కఠిన కోచింగ్