సినిమా ఇండస్ట్రీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను సీఎంగా గుర్తించడానినికి సినిమా వాళ్లు ఇష్టపడటం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్లకు గుర్తున్నారా.. అసలు ఏపీ సినిమా వాళ్లకు గుర్తుందా అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని నల్లపురెడ్డి ప్రశ్నించారు. సినిమా వాళ్లంతా తమ కమ్యూనిటీ వాళ్లు కాబట్టి వారంతా చంద్రబాబును సపోర్ట్ చేస్తున్నారని నల్లపురెడ్డి ఆరోపించారు. 


Also Read: ఎప్పుడు : పదో తేదీ , ఎక్కడ : అమరావతి, ఏం జరగనుంది : ఆర్జీవీ - పేర్ని నాని భేటీ !


సినీ పరిశ్రమపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల కిందట నెల్లూరు, రాయలసీమల్లో వరదలు వచ్చినప్పుడు సినిమా హీరోలు విరాళాలు ఇవ్వలేదని కూడా తిట్టారు. సినిమా వాళ్లకు అసలు బుద్ది లేదన్నారు. ఇప్పుడు సినిమా టిక్కెట్ల వివాదంలో మరోసారి సినీ పరిశ్రమపై తన టంగ్ పవర్ చూపించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఆయన నిర్మాత కూడా కాదు. ఎగ్జిబిటర్ కూడా కాదు. అయినప్పటికీ సినిమా పరిశ్రమ విషయంలో ఆయన చొరవ తీసుకుని మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. 


Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


సినిమా టిక్కెట్ల వివాదంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ అంతకంతకూ పెరిగిపోతోంది. సినీ పరిశ్రమపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో పవన్ కల్యాణ్ ఆన్ లైన్ టిక్కెట్ల వివాదంపై మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మంత్రులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఓ వైపు హైకోర్టు సూచనలతో నియమించిన కమిటీ చర్చలు జరుపుతోంది.. మరో వైపు పేర్ని నానితో ఆర్జీవీ కూడా చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో నల్లపురెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


టాలీవుడ్‌ను కించ పరిచేలా వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నా సినీ పరిశ్రమలో ఎవరూ నోరు మెదపలేకపోతున్నారు. ఎవరైనా వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంటర్ ఇస్తే అది వివాదాస్పదం అయి.. సమస్య మరింత జఠిలం అవుతుందన్న ఉద్దేశంతో సైలెంట్‌గా ఉంటున్నారు. అదే టాలీవుడ్‌ను అధికార పార్టీ నేతలకు మరితం అలుసు చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి