కోలీవుడ్ లో మాధవన్- విజయ్ సేతుపతి కలిసి నటించిన 'విక్రమ్ వేద' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో కూడా సినిమా రీమేక్ అవుతుందని అన్నారు. అయితే ముందుగా హిందీ రీమేక్ మొదలైంది. ఈ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తున్నారు. భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. 'విక్రమ్ వేద' ఒరిజినల్ వెర్షన్ కు కథ రాసి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి.. ఈ హిందీ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈరోజు హృతిక్ రోషన్ తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
వేద పాత్రలో హృతిక్ లుక్ ఆకట్టుకుంటుంది. ఆయన రగ్డ్ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. లాంగ్ హెయిర్, గడ్డం, నల్ల కుర్తా, గ్లాసెస్ వేసుకొని రక్తంతో తడిసిన అతడిని చూస్తుంటే.. సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. విక్రమ్ ఔర్ బీటాల్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన నియో-నాయర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఒక పోలీస్.. గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.
Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..