ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,280 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 984 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 152 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 5606 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,82,843కి చేరింది. గడిచిన 24 గంటల్లో 152 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 5606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,505కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,16,30,231 శాంపిల్స్ పరీక్షించారు.  


Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష






Also Read: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్


ఏపీలో రాత్రి కర్ఫ్యూ


బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మందికి మించకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. థియేటర్లలో సగం కెపాసిటీతో అనుమతించాలన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంచాలని అధికారులను ఆదేశించారు.  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. 


Also Read: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి