నిత్యావసరాల ధరలు తగ్గించాలని.. టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి అనే నినాదంతో టీడీపీ జనాల్లోకి వెళ్లనుంది. పార్టీ ముఖ్యనేతలతో ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లోపాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు వైసీపీ సమాధానం చెప్పడం లేదని.. ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు.
మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్రిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అతడిని.. వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని పునః సమీక్షించాలని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చంద్రబాబు అన్నారు. వినుకొండలో మద్దతు ధర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టి.. జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చంద్రబాబు అన్నారు. రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని ఆరోపించారు. ఏటా జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలన్నారు.
మరోవైపు.. చంద్రబాబు తీరుపై మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు.. సీఎం పాలనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూడలేకనే టీడీపీ అధినేత చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి