విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్.. ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకు 30 ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు 'విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022' కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 11 జనవరి 2022 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభవుతుంది.


ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో పని చేసేందుకు అర్హత సాధించినవారు సిద్ధంగా ఉండాలి. 11 జనవరి 2022తో ప్రారంభమయ్యే అప్లికేషన్లు.. 31 జనవరి 2022న ముగుస్తుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో పరీక్ష ఉంటుంది.  మెుత్తం 30 పోస్టులకు గానూ ఈ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు.  ఆన్ లైన్ ఎగ్జాబ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 35 వేల వేతనం ఉంటుంది.


విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న సిబ్బంది, అర్హత ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థికి ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవటంలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. 20 నుంచి 32 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు రుసుము రూ.1,000 ఉంటుంది. 


అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లంలో నిర్వహిస్తారు. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లంలో నిర్వహిస్తారు. అవసరమైన రుసుముతో దరఖాస్తు చేసుకున్న మరియు సకాలంలో దరఖాస్తులు స్వీకరించబడిన అర్హులైన అభ్యర్థులందరూ ఆన్‌లైన్  పరీక్షకు హాజరు అవుతారు.


ఆన్‌లైన్ పరీక్షకు 150 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు  25 మార్కులు ఉంటాయి.  తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఈ పీడీఎఫ్ లింక్ క్లిక్ చేయండి..


Also Read: Hyderabad Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..


Also Read: MIDHANI Recruitment 2022: హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనం.. అప్లై చేసుకోండిలా..


Also Read: BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా? 


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు


Also Read: సినిమా చూసిన టైంలో పైసా ఖర్చు లేకుండా యానిమేషన్ నేర్చుకోండిలా.. కొత్త సంవత్సరంలో కొత్తగా ట్రై చేయండి..