ఇండోనేషియాలో ఓ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిందంటూ ఓ వీడియోను కొంత మంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఆ ఫ్లైట్ మీద గరుడ ఇండొనేషియా అని ఉంది. దీంతో అది ఇండోనేషియాలోనే జరిగిందని ... తీర్మానించేసి.. ట్విట్టర్‌లో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో క్షణాల్లో వాట్సాప్‌లో వైరల్ పోయాయి. ఆ వీడియోకు లింక్ అంటూ... మరో విమానంలో నుంచి ప్రయాణికుల్ని ఎమర్జెన్సీగా బయటకు తెస్తున్న వీడియోను లింక్ చేశారు. కానీ ఆ రెండు వేర్వేరు.
గరుడ ఇండోనేషియా ప్లైట్ క్రాష్ ల్యాండింగ్ కాలేదు. అది ఓ వీడియో గేమ్‌కు సంబంధించిన వీడియో క్లిప్. ఆ వీడియో గేమ్ పేరు ఎక్స్ - ప్లేన్ 11. ఈ వీడియోను రెండేళ్ల కిందటే యూట్యూబ్‌లోఅప్ లోడ్ చేశారు. దాని పేరు మోస్ట్ క్రేజీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బై డ్రంక్ పైలట్ ఎక్స్ ప్లేన్ 11. ఇందులో చాలా విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యే దృశ్యాలు ఉన్నాయి. కానీ అన్నీ సిమ్యులేటర్ వీడియోలే. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఈ కింది యూ ట్యూబ్ లింక్‌లో ఐదు నిమిషాల నలభై నాలుగు సెకన్ల వద్ద ఉంది.
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్
ఈ వీడియోను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ ఒక్క ఫ్లైట్ క్లిప్ ను మాత్రం ఎడిట్ చేసి.. దాన్ని ఫ్లైట్ యాక్సిడెంట్‌గా సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించాలని ప్లాన్ చేసుకున్నారు ఫేక్ స్టార్స్. దాని కోసం పాత ఫ్లైట్ వీడియో రెస్క్యూ దృశ్యాలు వాడుకున్నారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రమాదకరగా మారింది. అయితే ఇలాంటి వీడియోలు వస్తే.. ఎప్పటికప్పుడు ప్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ప్రపంచం అంతా తిరికి వస్తుందన్న సామెత ఉండనే ఉంది. అందుకే ఫేక్ పట్ల నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి