రైలు పట్టాలపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. అందులో ఇరుక్కున్న పైలట్.. మరోవైపు దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్... ఇదీ సినిమా సీన్ కాదు.. రియల్ సీన్.  సినిమా సీన్లలో అయితే హీరో వచ్చి పైలట్‌ను హీరోచితంగా కాపాడుకుని తీసుకెళ్తారు. అందు కోసం చాలా ఎలివేషన్ షాట్స్ రాసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఎలివేషన్ షాట్స్ ఏమీలేవు. కానీ హీరోలున్నారు.  శరవేగంగా స్పందించి పైలట్‌ను కాపాడారు. క్షణంలో పైలట్‌ను కూలిపోయిన చిన్నపాటి విమానం నుంచి బయటకు తీసుకు రావడం.. వెంటవే  బుల్లెట్ వేగంతో ట్రైన్ .. ఆ కూలిపోయిన విమానాన్ని ఢీకొట్టేసి వెళ్లిపోవడం జరిగిపోయాయి.


 





Also Read: పాట నచ్చలేదని.. పెళ్లి వేదికపైనే వధువుకు విడాకులిచ్చిన వరుడు, బిడ్డ బాగా హర్ట్ అయ్యాడు!


అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో  ఓ ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ కు గాల్లో సమస్య వచ్చింది. పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో క్రాష్ ల్యాండింగ్ అయింది. ఏ చెట్టు మీదో..రోడ్డు మీదో అయితే  ఎలాగోలా గాయాలతో బయటపడేవారు. కానీ ఖచ్చితంగా ఆ విమానం రైల్వే ట్రాక్‌పై పడింది. అందులో పైలట్ తీవ్ర గాయాల పాలయ్యారు. కదల్లేని స్థితిలో ఉన్నారు. దూరంగా ట్రైన్ శరవేగంగా దూసుకొస్తోంది. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ పడినట్లుగా తెలుసుకున్న పోలీసులు శరవేగంగా అక్కడికి వచ్చారు. దూరంగా వస్తున్న ట్రైన్‌ను చూసి మరింతవేగంగా స్పందించారు. ఏ మాత్రం ఆలోచించకుండా... తాము రక్షించేలోపు వచ్చి తమను ఢీకొట్టేస్తుందేమో అన్న ఆలోచన రానీయకుండా రంగలోకి దిగారు. వెంటనే పైలట్‌ను తీసుకుని కాస్త దూరం వచ్చారు. అలా వారు వచ్చిన రెండు సెకన్లలోనే ట్రైన్ వేగంగా .. ఆ కూలిపోయిన విమానాన్ని ఢీకొట్టింది. 


Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్


ఈ దృశ్యాలన్నీ పోలీసులు ధరించిన బాడీవోర్న్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలను అక్కడి పోలీసు సిబ్బంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోలీసు సిబ్బంది హీరోయిజం ప్రదర్శించాలని నెటిజన్లుఅందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడీ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. 



Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి