గిన్నీస్ బుక్ వాళ్లు విడాకుల కేసు మీద దృష్టిపెట్టారో లేదో. ఒక వేళ వారి రికార్డుల్లో దానికి కూడా స్థానం ఉన్నట్లయితే.. ప్రపంచంలోని ఫాస్టెస్ట్ డివోర్స్ కేసుల్లో ఇది ఒకటి అవుతుంది. ఔనండి.. ఇతగాడు, అలా పెళ్లి చేసుకున్నాడో లేదో.. అలా విడాకులు ఇచ్చేసి వధువుకు షాకిచ్చాడు. ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఖర్చులు వేస్టు.. అనేగా అనుకుంటున్నారు. కానీ, అతడి కారణాలు అతడికి ఉంటాయిగా. అయితే, అతడు విడాకులు ఇవ్వడానికి గల కారణం మీకు కొత్తగా అనిపించవచ్చు. కాదు.. కాదు.. చెత్తగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే.. అతడికి నచ్చని పాటకు డ్యాన్స్ చేయడమే వధువు తప్పట. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పెళ్లి వేడుకలో భాగంగా.. సిరియా గాయని లమిస్ కాన్ ఆలపించిన ‘మెశాయ్‌తారా’ అనే పాటకు వధువు డ్యాన్స్ చేసింది. ‘నేను నిన్ను కంట్రోల్ చేస్తా’ అనే ఆ పాట అర్థం. వధువుకు ఆ ఉద్దేశం ఉందో లేదో తెలియదుగానీ.. వరుడిని సరదాగా ఆట పట్టించాలనే ఉద్దేశంతో ఆ పాటకు డ్యాన్స్ చేసి సందడి చేసింది. అయితే, వరుడు దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేదు. పైగా కోపంతో రంకెలు వేశాడు. అయితే, అతడు అంత హర్ట్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ పాటలో ఉన్న లిరిక్స్ మరీ.. వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్నాయి.
‘‘నేను నిన్ను డామినేట్ చేస్తా. నువ్వు నా రూల్స్ పాటించాలి. వీధుల్లో ఎప్పుడైనా వేరే అమ్మాయిలను చూస్తే నీ సంగతి చూస్తా. అవును.. నేను డామినెంటే.. నువ్వు నా మాట విని.. నా చెప్పు చేతల్లో ఉన్నంతవరకే నువ్వు నాకు స్వీటు. నేను అహంకారిని’’ అంటూ సాగే ఈ పాట అబ్బాయిలను బాగా హర్ట్ చేస్తోంది. గతేడాది జోర్దాన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ పాట నచ్చలేదనే కారణంతో వరుడు.. వధువుకు విడాకులిచ్చాడు. వీళ్లకు చట్టం కూడా అనుకూలంగా ఉంది. అయినా.. అమ్మాయిలు ‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ’’ పాటలు పాడితే బాగుంటుంది గానీ. ఎక్కేస్తా.. తొక్కేస్తా.. అంటే అబ్బాయిలు హర్ట్ కారు?!
Also Read: 70 రోజులు.. స్నేహితుల శవాలను తిని ఆకలి తీర్చుకున్న రగ్బీ టీమ్
ఇజ్రాయెల్ చట్టం అందరికీ అనుకూలంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఇందుకు మరో ఘటన గురించి తెలుసుకోవలసిందే. 9999 సంవత్సరం వరకు దేశాన్ని వీడకూడదట: ఇజ్రాయెల్ విడాకుల చట్టం.. పెళ్లయ్యి, పిల్లలు పుట్టినవారి విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన నామ్ హుప్పెర్ అనే 44 ఏళ్ల వ్యక్తి ఇజ్రాయెల్‌కు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. 2012లో తన మాజీ భార్య పిల్లలతోపాటు ఇజ్రాయెల్‌కు వెళ్లింది. దీంతో నామ్ కూడా తని పిల్లలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఆ దేశానికి వెళ్లాడు. దీంతో అతడి భార్య 2013లో అతడిపై ఇజ్రాయెల్ కోర్టులో కేసు పెట్టింది. దీంతో కోర్టు.. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు రూ.18.19 కోట్లు చెల్లించాలి. లేదా డిసెంబరు 31, 9999 సంవత్సరం వరకు ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లకూడది. కనీసం హాలీడేస్‌లో కూడా దేశాన్ని వీడేందుకు వీల్లేదు’’ అని ఆదేశించింది.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి