జనవరి 11 మంగళవారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు మీకు  మంచి రోజు. ఉదయం నుంచి ఏదో ఆలోచనల్లో మునిగితేలి మధ్యాహ్నానికి వాటిని పరిష్కరించుకునే పనిలో పడతారు. ఉద్యోగులకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు వింటారు. వ్యాపారులకు మంచి రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. బంధువులను కలుస్తారు. 


వృషభం
కొన్ని అనవసరమైన పనులకు డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. ఎవరి గురించీ చెడుగా భావించవద్దు. చట్టపరమైన విషయాల్లో మీకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది.


మిథునం
వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. బంధువులను కలిసేందుకు ఉత్సాహం చూపిస్తారు. కుటుంబ సభ్యుల కోసం కొంత ఖర్చు చేస్తారు. 


Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
కర్కాటకం
కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో పార్టీల్లో పాల్గొంటారు.  ఇంటి వాతావరణం చాలా క్రమశిక్షణగా ఉంటుంది.  సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. 


సింహం
మీరు మీ భాగస్వామి విషయంలో ఎమోషనల్ అవుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీ పనితీరుతో అందర్నీ ఆఖట్టుకుంటారు. వ్యాపారులు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. 


కన్య 
పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో కొన్ని ఖరీదైన వస్తువులు పాడైపోతాయి. మీ లోపాలను సమర్థించుకునే బదులు, వాటిని అధిగమించేందుకు ప్రయత్నించండి. మీరు మీ జీవిత భాగస్వామిపై  ఓ విషయంలో కోపంగా ఉంటారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. చదువుతో పాటు ఇతర పనుల్లోనూ విద్యార్థుల ఆలోచనలు నిమగ్నమై ఉంటాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
తుల
ఈరోజు మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచి రోజు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వ్యాపార సంబంధాలు అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. వ్యాపారంలో పెద్ద ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు. రిస్క్ తీసుకోకండి.


వృశ్చికం
మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. విద్యార్థులు కొత్త కోర్సులు ప్రారంభిస్తారు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి రుణం తీసుకోవచ్చు. ఈరోజు మంచి రోజు అవుతుంది.  ఎంత బిజీగా ఉన్నా  కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించండి. 


ధనస్సు 
జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. స్నేహితులను కలుస్తారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సహోద్యోగులతో మీ సంబంధాలను పాడు చేసుకోకండి. రహస్య విషయాలపై ఆసక్తి ఉంటుంది.


Also Read: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
మకరం
వ్యాపారంలో మందగమనం ఉంటుంది.  విద్యార్థులు చదువు విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆనందం కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. 


కుంభం
ఈ రోజు మీరు ఒకరి ఆలోచనల ప్రభావానికి లోనవుతారు. వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తుల పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటర్వ్యూల్లో  విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆలయ దర్శనానికి వెళ్లవచ్చు.


మీనం
ఈ రోజంతా  గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు అవసరమైన నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగంలో మీ లక్ష్యాలను సమయానికి ముందే పూర్తి చేస్తారు. భూ ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి.


Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద తాళం.. ఇదిగో అయోధ్య రామ మందిరం కోసం సిద్ధం.. బరువు ఎంతో తెలుసా?
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి